
BBC Apologies: కొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ట్రంప్ జనవరి 6, 2021న చేసిన ప్రసంగాన్ని తప్పుదారి చూపించేలా ఎడిట్ చేసి ప్రసారం చేసినందుకు బీబీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని డిమాండ్ చేసినట్టు తెలిపారు.
బీబీసీ క్షమాపణలు, ప్రభావం
ట్రంప్ ప్రసంగాన్ని తప్పుడు అర్థంతో చూపించినందుకు బీబీసీ క్షమాపణలు తెలిపింది. ప్రసంగంలో సవరణలు చేసినందుకు బాధ్యత వహిస్తున్నట్లు చైర్మన్ సమీర్ షా వైట్‌హౌస్‌కు లేఖ పంపారు. ఇప్పటికే వివాదానికి సంబంధించి బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ ఛీప్ టర్నెస్ డెబోరా రాజీనామా చేశారు. అయితే ట్రంప్ డిమాండ్ చేసిన బిలియన్ డాలర్ నష్టపరిహారం చెల్లించడానికి బీబీసీ నిరాకరించింది.
బీబీసీ క్షమాపణలపై బ్రిటిష్ సాంస్కృతిక మంత్రి లిసా నాండీ స్పందించారు. ‘వారు అత్యున్నత ప్రమాణాలను పాటించలేదని అంగీకరించారు. దాని ఆధారంగా బోర్డు ఛైర్మన్ అమెరికా అధ్యక్షుడికి క్షమాపణ తెలిపారు’ అని పేర్కొన్నారు. ట్రంప్ మాట్లాడుతూ.. సమస్యపై ఇప్పటివరకు యుకే ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్‌తో మాట్లాడలేదని, వారాంతంలో ఫోన్ చేస్తానని తెలిపారు. కాగా, బీబీసీ క్షమాపణలు తెలిపిన తర్వాత ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
ALSO READ: Gold Rates: తగ్గిన బంగారం ధరలు





