
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ఎలా చేస్తారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బతుకమ్మ పండుగ అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ పండుగకు ప్రతీక. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా దసరా నవరాత్రులలో భాగంగా బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఏర్పాట్లను చేసుకుంటుంది. ఈనెల 30వ తేదీన గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్ ప్రధాన ఆకర్షణగా నిలువనుందని అధికారులు చెప్పుకొస్తున్నారు. మొదటగా అమరవీరుల స్మారక చిహ్నం నుంచి… బతుకమ్మ ఘాట్ వరకు కూడా దాదాపు 2500 మంది మహిళలు బతుకమ్మలతో ర్యాలీ చేయడానికి ఏర్పాటు చేయనున్నారు. దీనికిగాను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లకు సిద్ధంగా ఉంది.
Read also : డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే భారీ జరిమానా, జైలు శిక్ష తప్పదు
ఈ బతుకమ్మ ర్యాలీలో భాగంగా 2500 మంది మహిళల పై హెలికాప్టర్లతో పూల వర్షం కూడా కురిపించునున్నారని అధికారులు చెబుతున్నారు. ర్యాలీలో మహిళలు నడుస్తున్న సమయంలో హెలికాప్టర్ నుంచి పూలను చల్లి వారికి ఘన స్వాగతం పలుకుతారని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఈనెల 28వ తేదీన LB స్టేడియం లో ఏకంగా 20 వేల మందితో బతుకమ్మ ఆడించి గిన్నిస్ రికార్డు సృష్టించేందుకు కూడా అన్ని ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. దీంతో ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ చాలా ఘనంగా నిర్వహించి మరోచరిత్ర సృష్టించాలని ప్రభుత్వం గట్టిగా ఆలోచనలు చేస్తుంది. ఏది ఏమైనా కూడా తెలంగాణ అంటేనే బతుకమ్మ. ఈ బతుకమ్మలో భాగంగా చిన్న పిల్లలనుంచి పెద్దవారు వరకు కూడా చాలా సంతోషంగా పాల్గొని పండుగను విజయవంతంగా నిర్వహిస్తారు. తెలంగాణలో జరిగినట్లుగా ఈ బతుకమ్మ పండుగను మరి ఏ రాష్ట్రంలో జరిపిన సందర్భాలు లేవు.
Read also : దీపికాను తీసేయడం పట్ల సోషల్ మీడియాలో ఫాన్స్ మధ్య వార్?