తెలంగాణరాజకీయం

Bandi Sanjay: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు హిందువుల్లో కసిని పెంచాయి

Bandi Sanjay: రాష్ట్రంలో హిందువులంతా ఒకే తాటిపైకి వచ్చి, తమ ఓటు శక్తి ఎంత ప్రభావాన్ని చూపగలదో గుర్తించే సమయం వచ్చిందని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.

Bandi Sanjay: రాష్ట్రంలో హిందువులంతా ఒకే తాటిపైకి వచ్చి, తమ ఓటు శక్తి ఎంత ప్రభావాన్ని చూపగలదో గుర్తించే సమయం వచ్చిందని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కూకట్‌పల్లిలో జరిగిన కాపు కులస్తుల కార్తీక వనభోజనాల సందర్భంగా మాట్లాడిన ఆయన.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు హిందువుల్లో కొత్త ఉత్సాహాన్ని, కసిని రేకెత్తించాయని వ్యాఖ్యానించారు. అక్కడి ఫలితాలు కొందరు ముస్లింలకు అనుకూలంగా మారిన తీరు హిందువుల్లో అసంతృప్తిని పెంచిందని తెలిపారు. ఇకనైనా హిందువులు విభజనలను మరచి, ఒకటై తమ ఓటుతో హిందూ ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

మత మార్పిడి దేవుళ్లను మోసం చేసినట్లేనంటూ దీని వెనుక ఉన్న ప్రమాదాలను హిందువులు గమనించాలన్నారు. ఇతర మతాల్లో చేరిన వారు తిరిగి తమ మూలాలకు రావాలన్న ఉద్దేశంతో ఘర్ వాపసీ కార్యక్రమాలను హిందూ ధర్మ రక్షణలో కీలకంగా పేర్కొన్నారు. హిందూ సనాతన ధర్మం ప్రపంచంలోనే గొప్ప జీవన విధానమని, హిందువుగా పుట్టడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని ఆయన స్పష్టం చేశారు. అన్ని కులాలు సామాజికంగా ఎదుగుతూ, హిందూ ధర్మ రక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ప్రచారం కారణంగా మతమార్పిడి చేసిన చాలా మందిలో పునరాలోచన మొదలైందని చెప్పారు. కార్తీక వనభోజనాలు నిర్వహిస్తున్న అన్ని కులాలకూ అభినందనలు తెలుపుతూ, హిందూ సమాజం ఐక్యంగా ముందుకు సాగితే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలదని బండి సంజయ్ పేర్కొన్నారు.

ALSO READ: Manchu Lakshmi: అది తల్చుకుని కిందపడి ఏడ్చా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button