
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఒకవైపు బంద్!.. మరోవైపు రెండు రోజుల్లో దీపావళి.. దీపావళి పండుగకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో నేడు జరుగుతున్న రాష్ట్ర బంద్ దీపావళి పై ప్రభావం చూపుతుందని కొంతమంది దుకాణదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్ కావడంతో నేడు, రేపు పెద్ద ఎత్తున ప్రజలు టపాసులు, దీపాలు, వస్త్రాలు, గోల్డ్ మరియు స్వీట్స్ దుకాణదారులు కొనుగోలు అవుతాయని ఆశించారు. వీకెండ్ కావడంతో శనివారం, ఆదివారం ఈ రెండు రోజుల్లో భారీగా బిజినెస్ జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ బంద్ కారణంగా ఒక రోజు వృధాగా పోయింది అని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ రెండు రోజుల్లోనే ఎక్కువ ఆదాయం వస్తుంది అని… ఇక మిగతా రోజుల్లో ఎలాంటి ఆదాయం వస్తుందనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే గా అని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్ దీపావళి పండుగ వ్యాపారులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. బీసీ సంఘాలు బంద్ పిలుపుతో జనమంతా కూడా బందులో పాల్గొనడంతో ప్రజల రాక తగ్గి బిజినెస్ పై పూర్తిగా ఎఫెక్ట్ పడుతుందని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా జరిగే బంద్ ఈ రోజు సాయంత్రానికి ముగిసే అవకాశం కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా ఎటువంటి దుకాణాలు తీయకూడదని ఇప్పటికే పలువురు నాయకులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో రేపు అలాగే ఎల్లుండి మాత్రమే దుకాణదారులకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
Read also : ఏపీకి భారీ వర్ష సూచన.. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలు జాగ్రత్త!
Read also : ఆర్జీవి పై మరో కేసు నమోదు.. ఎందుకంటే..?