అమృత్ పథకం టెండర్లు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. అమృత్ టెండర్లలో భారీ స్కాం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేయడంతో మంట పుట్టింది. కేటీఆర్ ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి టెండర్ కట్టబెట్టారన్న వార్తలను ఆయన ఖండించారు. పొంగులేటి కౌంటర్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ కు లీగల్ నోటీస్ పంపించారు. అడ్డగోలు ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కల్గించారని నోటీసులో ఆరోపించారు సృజన్ రెడ్డి.
సృజన్ రెడ్డి నోటీసులపై స్పందించారు కేటీఆర్. బావమరిదితో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తా అనుకుంటున్నావా ? అంటూ ట్వీట్ చేశారు. బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్ లోనే ఆయన బావమరిది శోద కంపెనీకి ₹1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజం.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7, 11, 13 ని ముఖ్యమంత్రి ఉల్లంఘించిన మాట నిజం అని ట్వీట్ లో తెలిపారు కేటీఆర్.
Read More : మిత్రుడి కోసం నెల్వలపల్లికి వచ్చిన బండి సంజయ్
శోద అనే కంపెనీ గత రెండు సంవత్సారాలుగా రెండు కోట్లు మాత్రమే లాభం ఆర్జించిన ఒక చిన్న కంపెనీ..ఢిల్ల లో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడడం కష్టమేనంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ దేశంలో న్యాయవ్యవస్థ బలంగా, నిజాయితీగా ఉన్నది.. ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్ లాగా నువ్వు దొరికావు.. రాజీనామా తప్పదు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.