
బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న హింగ్లాజ్ మాత ఆలయం ఇప్పుడు సోషల్ మీడిమాలో వైరల్గా మారింది. హింగ్లాజ్ మాత ఆలయం అమ్మవారి శక్తిపీఠాలలో ఒకటి. ప్రస్తుతం ఇది బలూచిస్తాన్‌లో వుంది. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఈ ఆలయ సందర్శన గురించి భారతీయులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే ఇప్పుడు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడంతో ఆ ఆలయంపై దేశంలో చర్చ మోదలయ్యింది.
బలూచిస్తాన్‌లోని హింగ్లాజ్ మాతా ఆలయం సనాతన ధర్మానికి చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రం . దేశ విభజనకు ముందు బలూచిస్థాన్ హిందువులకు చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా ముఖ్యమైనదిగా వుండేది. ప్రతీ యేటా ఇక్కడ మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున హింగ్లాజ్ జాతర జరుగుతుంది. విభజనకు ముందు ఈ జాతరలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొనే వారు. దేశం విడిపోయిన తరువాత ఈ జాతరకు వెళ్ళే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. జాతర ప్రాముఖ్యత కూడా అంతంత మాత్రంగా మారింది. కానీ బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడంతో ప్రస్తుతం జాతరకు ప్రాముఖ్యతతో పాటు , వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగింది.
బలూచిస్థాన్ మారుమూల కొండల్లో హింగ్లాజ్ ఆలయం ఉంది. ఈ హింగ్లాజ్ మాత ఆలయానికి చాలా చిత్ర ఉంది. ఈ పురాతన గుహ ఆలయం ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించుకుంటారు. ఆలయాన్ని చేరుకోవడానికి భక్తులు వందల మెట్లు ఎక్కి రావాల్సి వుంటుంది. అమ్మవారి దర్శనానికి కొండలు, గుట్టల రాళ్ల గుండా ట్రెక్కింగ్ చేసి వస్తారు. కొబ్బరికాయ, గులాబీ రేకులు వేసి హింగ్లాజ్ మాత దర్శనానికి దైవ అనుమతి కోరతారు.
సింధీ, భావ్సర్, చరణ్ వర్గాలకు చెందిన భక్తులు శతాబ్దాలుగా ఎడారి మార్గాలను దాటి ఆలయాన్ని సందర్శిస్తంటారు. అమ్మవారి దర్శనం కోసం ఎంతో కష్టతరమైన ప్రయాణాలు చేస్తున్నారు. ముస్లింలు కూడా ఈ స్థలాన్ని నానీ మందిర్ అని ఎంతో గౌరవంతో చూస్తారు. ఈ ఆలయంలో అమ్మవారి లీల గురించి అనేక జానపద కథలు ప్రాచుర్యంలో కూడా ఉన్నాయి.