
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత్ మరియు సౌతాఫ్రికా మధ్య ఈనెల 30వ తేదీ నుంచి వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే ఈ వన్డే సిరీస్ కు ఇండియన్ స్టార్ క్రికెటర్ దూరం కానున్నారు అని సమాచారం. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో జరుగుతున్నటువంటి వన్డే సిరీస్ లో గాయపడ్డారు. ఆ తరువాత ఆసుపత్రిలో చేరి ఐసీయూలో చికిత్స కూడా పొందారు. ఈ సందర్భంలోనే శ్రేయస్ అయ్యర్ ఇంకా పూర్తిగా కోల్గోలేదని సమాచారం. శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకోవడానికి అలాగే సెలక్షన్ కు అందుబాటులోకి రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది అని అంటున్నారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో భాగంగా అయ్యర్ గాయపడినప్పుడు అతని ఆక్సిజన్ లెవెల్స్ 50 కి పడిపోయాయి. ఆ సందర్భంలో కంప్లీట్ గా బ్లాక్ అవుట్ అయిపోయాడు అని బీసీసీఐ సోర్సెస్ చెప్పినట్లుగా తాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్ కీలక ప్రకటన విడుదల చేసింది. శ్రేయస్ అయ్యర్ కు పూర్తిగా కోలుకునే అంతవరకు విశ్రాంతి ఇవ్వాలని బోర్డు భావిస్తున్నట్లుగా ప్రకటన విడుదల చేసింది. దీంతో అయ్యర్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏది ఏమైనా కూడా శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోల్కొని మళ్ళీ తిరిగి జట్టులోకి రావాలి అని.. మైదానంలో అడిగి పెట్టి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాలి అని కోరుకుంటున్నారు. మరోవైపు సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ లో భాగంగా రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఆడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి శ్రేయస్ అయ్యర్ స్థానంలో ఎటువంటి ప్లేయర్లు తీసుకువస్తారు అనేది.. ఎవరెవరు జట్టులో ఆడబోతున్నారు అనేది ఇంకా వివరణ రావాల్సి ఉంది.
Read also : కోదాడ పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహించిన జిల్లా పోలీస్ స్పెషల్ టీమ్స్
Read also : అందరు మాటలు చెబుతారు.. కానీ నేను అలా కాదు : సీఎం





