మందుబాబులకు బ్యాడ్ న్యూస్… ఇవాళ్టి నుంచి వైన్స్‌లు బంద్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుర ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రెండురోజుల పాటు వైన్సులు, బార్లు బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు సాయంత్రం 5గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 5గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు జరిగే 13వ తేదీన కూడా నిషేధం వర్తించనుంది.









