ఆంధ్ర ప్రదేశ్

అప్పట్లో HYB అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది.. నేడు వైజాగ్ కు 10 ఏళ్లు చాలు : లోకేష్

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి వివిధ రాష్ట్రాలు అలాగే దేశాల నుంచి పెట్టుబడులు నేరుగా రాష్ట్రాన్ని తీసుకువస్తున్నామని అన్నారు. అప్పట్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాదును అభివృద్ధి చేయడానికి దాదాపు 30 ఏళ్లు పట్టింది. కానీ ఇప్పుడు విశాఖపట్నం ను అభివృద్ధి చేయడానికి 10 సంవత్సరాలు చాలు అని ధీమా వ్యక్తం చేశారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ చాలా బాగా పెరిగిపోయిందని.. ఆనాటి కాలంలో చాలా ఆలస్యంగా పనులు జరిగేవి అని.. కానీ నేడు అపరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి కాబట్టి కేవలం 10 ఏళ్లలోనే విశాఖపట్నం ను అభివృద్ధి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ప్రతిరోజు కూడా కంపెనీలను వైజాగ్ రప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాలతో కాకుండా… ఇతర దేశాలతో పోటీపడే విధంగా పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకువస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ప్రస్తుత గ్రేటర్ విశాఖ ఎకానమీ 2027 వ సంవత్సరంలోపు బిలియన్ డాలర్లకు చేరుతుందని కరాకండిగా చెప్పారు. కాగా అప్పట్లో హైదరాబాదును నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారని ఇప్పటికి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వైజాగ్కు ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. వైజాగ్ లో రాష్ట్రానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఒకవైపు పర్యాటక రంగంగా మరోవైపు పారిశ్రామికపరంగా వైజాగ్ ను అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే వైజాగ్ ను అభివృద్ధి చేయడానికి 10 ఏళ్ళు సరిపోతుంది అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. దీంతో తండ్రికి తగ్గ తనయుడిని కొంతమంది రాజకీయ నాయకులు లోకేష్ గురించి చర్చిస్తున్నారు.

Read also : ” కల్తీ ” అనే పదంతో గజ గజ వణికిపోతున్న ప్రజలు..!

Read also : కాంగ్రెస్ ను ఓడించి తీరాలి… హిందీ సామెతలతో సభను మార్మోగించిన కేటీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button