వైరల్సినిమా

బాబు లేటెస్ట్ లుక్స్… అదిరిపోయాడు అంతే!

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వారణాసి మూవీ కోసం హైదరాబాదులో హాలీవుడ్ మీడియాతో ఇంటర్వ్యూలో భాగంగా మహేష్ బాబు మీడియాకు కొన్ని ఫోటోలు తీసుకునే అవకాశాలు ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడున్నటువంటి మీడియా వారందరూ కూడా టకా టకా ఫోటోలు తీసుకున్నారు. బాబు లేటెస్ట్ లుక్స్ లో చాలా బాగున్నారు అని.. మునుపు ఎప్పుడూ కూడా ఇలాంటి లుక్స్ లో మహేష్ బాబుని చూడలేదు అని చాలామంది కూడా ఆ ఫొటోస్ ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ ఫొటోస్ లో జీన్స్ ప్యాంట్ వేసుకొని వైట్ టీ షర్ట్ పైన బ్లాక్ కోటు వేసి అలా నడుచుకుంటూ వస్తున్న ఫోటోలు మహేష్ బాబు అభిమానులందరినీ కూడా ఆనందింప చేస్తున్నాయి. మహేష్ బాబు కోసం ఏకంగా హాలీవుడ్ హైదరాబాద్ కు వచ్చిందని ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు. ప్రస్తుత మహేష్ బాబు ఫోటోలు సూపర్ గా ఉన్నాయి అని.. ఈ వారణాసి మూవీ విడుదల అయ్యేంతవరకు ఇలా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు విడుదల చేస్తూ ఫ్యాన్స్ ను సంతోషింప చేసేలా చూసుకోవాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళితో సినిమా కాబట్టి ఆ మాత్రం లుక్ ను మెయింటైన్ చేయాలని మహేష్ బాబు కూడా భావిస్తున్నారు ఏమో అన్న విధంగా ఫోటోలు ఉన్నాయి.

Read also : రైతన్నలకు వెన్నుపోటు పొడవడం మీ వల్లే సాధ్యం : వైసీపీ

Read also : యాంకరింగ్ లో ఆమెకు మించి తోపులేరు.. ఖచ్చితంగా ‘పద్మశ్రీ’ ఇవ్వాలి : ఆది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button