జాతీయంసినిమా

టాలీవుడ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ‘బాహుబలి’.. సరిగ్గా ఇదే రోజు?

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- రాజమౌళి మరియు ప్రభాస్ కాంబినేషన్లు వచ్చినటువంటి బాహుబలి సినిమా ఏ రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సినిమా ద్వారా ప్రభాస్ రేంజ్ మారిపోవడంతో పాటుగా ఒకేసారి టాలీవుడ్ రేంజ్ కూడా వేరే స్థాయికి వెళ్ళింది. సరిగ్గా 2015వ సంవత్సరంలో ఇదే రోజున బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా విడుదలయ్యింది. అప్పటివరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలలో మామూలు బడ్జెట్ సినిమాలు మాత్రమే ఎక్కువగా విడుదల అయ్యేవి. కానీ పాన్ ఇండియా సినిమాతో డైరెక్టర్ రాజమౌళి బాహుబలి సినిమాతో టాలీవుడ్ రేంజ్ ను అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఇలాంటి హీరోలు ఉన్నారా అనేలా చేశారు. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు కూడా బాలీవుడ్ సినిమాలనే చెప్పేవారు. కానీ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ సినిమా ఏంటి అంటే కచ్చితంగా టాలీవుడ్ సినిమాలు అని చెప్తారు.

2015 వ సంవత్సరంలో అంటే సరిగ్గా పది సంవత్సరాల క్రితం ఇదే రోజు బాహుబలి విడుదలై రెండు తెలుగు రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్ మార్కును సృష్టించింది. భారీ కలెక్షన్లు పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సినిమాలు కూడా తీయొచ్చా అనేలా డైరెక్టర్లను ఆలోచింపజేసేలా తెలుగు డైరెక్టర్ రాజమౌళి నిరూపించారు. ఈ సినిమా ప్రతి ఒక్క సన్నివేశం కూడా చూడ్డానికి ఎంతో చక్కగా ఉంటుంది. అప్పటిదాకా ఇలాంటి సినిమాలు ఒక్కటి లేకపోవడంతో ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్ సినిమాగా నిలిచిపోయింది. ఈ చిత్రం భారీ విజయం సాధించిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ( టాలీవుడ్) రేంజ్ వేరే స్థాయికి వెళ్ళిపోయింది. ఆ తరువాత టాలీవుడ్ ఆశయాలు, ప్రేక్షకులలో అంచనాలు, సినిమా బడ్జెట్, మార్కెట్ విస్తరణ అలాగే సాంకేతిక నైపుణ్యం కూడా గణనీయంగా పెరిగిపోయాయి. ఇక ఈ పదేళ్ల కాలంలో భారీ బడ్జెట్ సినిమాలు ఎన్ని వచ్చినా కూడా బాహుబలి రికార్డులను దాటలేకపోయింది.

సర్పంచ్‌ ఎన్నికలపై నేడే క్లారిటీ

హసీనాను అప్పగించండి, భారత్ ను మరోసారి కోరిన బంగ్లాదేశ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button