
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- ప్రభాస్ మరియు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చినటువంటి బాహుబలి సినిమాను రెండు పార్టులుగా కలిపి బాహుబలి ది ఎపిక్ పేరిట అక్టోబర్ 31వ తేదీన విడుదల చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాలలోనూ ఈ బాహుబలి సినిమాను విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా రెండు పార్టీలను ప్రతి ఒక్కరూ కూడా ఇంతకుముందే వీక్షించారు. కానీ రెండు సినిమాలు ఒకే సినిమాగా రూపుదిద్దుతే ఎలా ఉంటుందో రాజమౌళి సరికొత్త కాన్సెప్ట్ తో మరోసారి ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. అయితే ప్రేక్షకులు ఎక్కడా కూడా ఈ సినిమాపై నిరాశ చూపలేదు. టికెట్లను కొనుగోలు చేసి థియేటర్లకు దూసుకెళ్లి మరి సినిమాను మరోసారి చూడడానికి సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజునే మంచి కలెక్షన్లను రాబెట్టింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో కలిపి అక్టోబర్ 31వ తేదీన 19.6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సినిమా చిత్ర బృందం తెలిపింది. మన భారతదేశవ్యాప్తంగా ఈ సినిమాకు 13 కోట్లు రాగా విదేశాల్లో ఈ సినిమాకు 6.65 కోట్లు వచ్చాయని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్, అనుష్క శెట్టి, దగ్గుపాటి రానా వంటి ముఖ్య నటులు నటించారు. బాహుబలి అనే సినిమాతో ప్రపంచమంతా కూడా టాలీవుడ్ వైపు చూసింది అంటే దానికి ముఖ్య కారణం ఈ సినిమా డైరెక్టర్ రాజమౌళి అనే చెప్పవచ్చు. ఈ సినిమాతో పాన్ ఇండియా అనే ట్యాగ్ ను సృష్టించాడు రాజమౌళి. ఈ సినిమాకి అప్పట్లో అత్యధిక వసూలు రావడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆహా అద్భుతమైన సినిమా అంటూ.. ఇటువంటి సినిమాలు గతంలో ఎప్పుడు చూడలేదు అంటూ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరితోపాటు రాజమౌళి ని కూడా ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ప్రశంసించారు.
Read also : T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ మామ.. రీజన్ ఇదే?
Read also : నేడే ఫైనల్ మ్యాచ్.. కప్ ఎవరిదో అంచనా వేసారా?





