
మర్రిగూడ,క్రైమ్ మిర్రర్ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల జోరు అంతా ఇంతా కాదనే చెప్పుకోవాలి.. ఈ నేపథ్యంలో ఓటర్లకు మధ్యం పంపిణి చెయ్యడం కోసం, తరలిస్తున్న మధ్యాన్ని మాల్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు.. డబ్బు, మందుతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే నేపథ్యంలో, మర్రిగూడ మండలం, అజ్జిలాపురం గ్రామసర్పంచ్ అభ్యర్థి నిర్వాహకం పోలీసుల చేతిలో బట్టబయలైంది.. సుమారు 24 కాటన్ల బీర్లను పోలీసులు శనివారం పట్టుకున్నారు. కోట్లకు అధిపతి అయిన అజ్జిలాపురం అభ్యర్థి నిర్వాహకానికి, డిపార్ట్మెంట్ శనివారం తెర వేశారు.. లోతైన విచారణతో సదరు అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Read also : బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ ఏ బొంద పెడతాడు : సీఎం రేవంత్
ప్రజల్లో పేరు, ప్రజల బాధలు, పడే కష్టాలు ఏమాత్రం తెలియని వ్యక్తులు, బస్తా డబ్బులు చల్లి, ఎన్నికల్లో గెలవాలి అనుకోవడం అవివేకమనే చెప్పుకోవాలి. పుట్టిన ఊరిలో ఏ గల్లీ ఎక్కడ ఉందో, ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో తెలియని వ్యక్తులు, ఉన్నట్లుంది గ్రామాలలో చేరి, స్థానికంగా ఉంటూ, ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తులపై డబ్బు రాజకీయం చెయ్యడం అక్కడక్కడ చూస్తూనే ఉన్నాము. అలాంటి విధానాలకు ప్రజలు చెక్ పెట్టుకుంటూనే వస్తున్నారు. ఆర్థికంగా ఎదిగిన వారిని కాకుండా, జనాలలో ఎదిగిన లీడర్లను ఎన్నుకునే పనిలో పడ్డారు ఓటర్లు. కాసింత పనిని కూడా తన పనిలా భావించే నాయకుడికి పట్టం కట్టాలని ఆలోచిస్తున్నారు.
Read also : డిసెంబర్ 25న “అఖండ -2” చిత్రం





