
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్:-
మహాదేవపూర్ మండలం, అంబట్ పల్లి గ్రామంలోని అమరేశ్వర ఆలయంలో అర్చకులు వంగల సత్యనారాయణ చారి మంత్రోచ్ఛరణతో అయ్యప్ప మాల ధారణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు సత్యనారాయణ చారి మాట్లాడుతూ.. అయ్యప్పస్వామి దీక్ష కారణంగా భక్తుల్లో ఆధ్యాత్మిక జీవనశైలితోపాటు, సేవాగుణం అలవడుతుందని తెలిపారు. కార్తీకమాసంలో లక్షలాది మంది భక్తులు అయ్యప్ప స్వామి మాలధారణతో తమ జీవితాల్లో సానుకూల మార్పును స్వాగతిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు మేడిపల్లి వెంకటస్వామి, లింగంపల్లి మాధవరావు, అమృత నగేష్, పుట్ట రాజబాపు, వావిలాల రామ్ చందర్, మరియూ అయ్యప్ప మాలధారణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాగా మరోవైపు శబరిమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం కారణంగా అధికారులు తగు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల స్వాములు శబరిమల క్యూ లైన్లలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. మరోవైపు శబరిమల కొత్త వ్యాధి కలకలం రేపుతోంది. కాబట్టి శబరిమల వెళ్ళే భక్తులందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి.
Read also : స్మృతి మందనా బ్యాడ్ లక్.. పెళ్లి వాయిదానే కాదు.. బయటకు వచ్చిన మరో విషయం?
Read also : గట్టుప్పల సర్పంచి బరిలో కర్నాటి శ్రీనివాస్…!





