
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- అయ్యప్ప భక్తులు ప్రతి ఏడాది కూడా 41 రోజులపాటు దీక్షలు చేసి శబరిమలకు పయనం చేస్తుంటారు. ఇక మకర జ్యోతిని దర్శించుకున్న తర్వాత అయ్యప్ప మాల వేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీక్ష అనేది విరమిస్తారు. అయ్యప్ప మాల వేసుకున్నటువంటి భక్తులను స్వయంగా అయ్యప్ప స్వామి మకర జ్యోతిగా దర్శనం ఇస్తాడు అని ప్రతి ఒక్కరి నమ్మకం. ఈ జ్యోతి దర్శనం చేసుకున్న వారికి జన్మ ధన్యమవుతుంది అని మరి కొంతమంది నమ్ముతూ ఉంటారు.
Read also : అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారు : కిషన్ రెడ్డి
అయితే తాజాగా శబరిమల వెళ్లేటువంటి అయ్యప్ప భక్తులకు సంబంధించి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మకర జ్యోతి పూజ సమయంలో ప్రతిరోజు కూడా 90000 మంది భక్తులను అనుమతించాలి అని తాజాగా బోర్డు సమావేశంలో నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ దర్శనాలకు సంబంధించిన బుకింగ్స్ నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. ఆన్లైన్ బుకింగ్ ద్వారా 70000 మంది స్పాట్ బుకింగ్ ద్వారా మరో 20 వేల మంది భక్తులు దర్శనం కోసం స్లాట్స్ బుకింగ్ చేసుకునే అవకాశాలను కల్పించారు. ఇక మకర జ్యోతి దర్శనం కోసం శబరిమలకు వచ్చేటువంటి భక్తులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. కాబట్టి శబరిమలకు వచ్చేటువంటి భక్తులు ఈ విషయాలను గమనించాలని ఆలయ అధికారులు కోరారు.
Read also : జీహెచ్‌ఎంసీ(GHMC) వాహనంపై విరిగిపడ్డ కొండచరియలు





