
క్రైమ్ మిర్రర్, సిద్ధిపేట:- సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సందులాపూర్ గ్రామానికి చెందిన రైతు గజేందర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేందర్ రెడ్డి కరెంట్ షాక్‌కు బలై ప్రాణాలు కోల్పోయారు. అడవి పందుల నుండి పంటను కాపాడే ఉద్దేశంతో మొక్కజొన్న పొలానికి రక్షణగా వైర్లు వేస్తుండగా, ఆ వైర్లు ప్రమాదవశాత్తు సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలాయి. దీంతో తండ్రి, కొడుకులు అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Read also : ట్రాఫిక్ జాం ఉన్నా టోల్ ఎందుకు కట్టాలి, సుప్రీం సూటి ప్రశ్న!
వర్షాకాలంలో రైతులు పొలాల వద్దకు వెళ్లేటప్పుడు, ముఖ్యంగా విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు దగ్గర పనులు చేయాల్సి వస్తే అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాలను బలి తీసుకునే ప్రమాదం ఉందని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
Read also : ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి పదవిగా అభ్యర్థి తిరుచీ శివ!