Saturday, March 28, 2026
Homeఅంతర్జాతీయంరోదసిలోకి మరో భారతీయుడు.. ఇంతకీ ఎవరీ శుభాంశు శుక్లా?

రోదసిలోకి మరో భారతీయుడు.. ఇంతకీ ఎవరీ శుభాంశు శుక్లా?

Shubhanshu Shukla:  ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్ష యాత్ర మొదలుపెట్టారు. ఈ యాత్రకు శుభాంశు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. యాక్షియం మిషన్ లో ఇవాళ(జూన్ 25న) మధ్యాహ్నం 12.01 గంటలకు అంతరిక్షంలోకి బయల్దేరింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ లోని లాంచ్‌ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం చేట్టాపరు.

రాకేష్ శర్మ తర్వాత రెండో భారతీయుడు

శుభాంశు శుక్లా అంతరిక్షయాత్రకు వెళ్లిన రెండో భారతీయ వ్యోమగామిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే భారత్ నుంచి రాకేష్ శర్మ 1984లో అంతరిక్ష యాత్రకు వెళ్లారు. భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ అంతరిక్ష యాత్ర చేసిన సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత శుభాంశు ఈ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రకు పైలెట్ గా శుభాంశును ఇస్రో సెలెక్ట్ చేసింది.

Read Also: శత్రువును మోకాళ్లపై కూర్చోబెట్టాం, ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు!

15 రోజుల పాటు కొనసాగనున్న యాత్ర

ఈ అంతరిక్షయాత్ర కోసం శుక్లా టీమ్ సుమారు నెల రోజులకు పైగా క్వారంటైన్ లో ఉన్నారు. 15 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. నలుగురు సభ్యులకు ఈ యాత్రలో 60 ప్రయోగాలు నిర్వహించనున్నారు. వీటిలో ఏడింటిని భారత సైంటిస్టులు రూపొందించారు. అంతరిక్షం నుంచి ప్రధాని మోడీతో శుక్లా మాట్లాడనున్నారు. నిజానికి ఈ యాత్ర మే 29న జరగాలి. కానీ, పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. చివరకు జూన్ 25న ఈ యాత్రను ఖరారు చేశారు. హ్యూస్టన్‌కు చెందిన యాక్సియం స్పేస్.. నాసా భాగస్వామ్యంతో ఈ యాత్రను కొనసాగిస్తున్నారు. ఇండో – యూఎస్ యాక్సింయా మిషన్ 4ను నిర్వహిస్తామని 2023లో అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశంతో ప్రధాని మోడీ ఒప్పందం చేసుకున్నారు. ఇది భారత్, అమెరికా అంతరిక్ష సహకారానికి కొత్త అధ్యాయం కాబోతుందని అప్పట్లో మోడీ ప్రకటించారు. ఇప్పుడు ఆ కొత్త అధ్యాయం నిజమైంది.

Read Also: ఉద్రిక్తతల పరిష్కారానికి సిద్ధం.. భారత్ కీలక ప్రకటన!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments