
క్రైమ్ మిర్రర్, అమరావతి:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏ కూటమి వైపు అండగా నిలబడుతున్నారో.. అనేది అర్థం కావడం లేదు. ఓట్ల చోరీ విషయం, ఉపరాష్ట్రపతి ఎంపిక విషయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి చాలా దూరంగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికలలో ఎన్నో అవకతవకలు జరిగాయని ఎన్నో విధాలుగా ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. రాహుల్ గాంధీతో కలిసి ఎలక్షన్ కమిషన్ పై పోరాడుతారా అనే ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి ఇది వరకే కుదరదు.. నో చెప్పేశారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళ ముగ్గురు కూడా ఒకటేనని తీవ్రంగా ఆరోపించారు.
Read also : Tahsildar corruption : లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన తహశీల్దార్
దేశంలో ఓట్ల చోరీ జరిగింది అని తీవ్రంగా ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడటం లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువ ఓట్ల చోరీ జరిగింది.. అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితుల గురించి లేదా స్కామ్ ల గురించి ఏనాడైనా ఒక మాట మాట్లాడారా?.. అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
Read also : కాంగ్రెస్ పాలనలోనే క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది : కేటీఆర్
అయితే తాజాగా ఎన్డీఏ కూటమికి సంబంధించి బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపేందుకు సానుకూలంగా స్పందించారట. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు వైసీపీ పూర్తిగా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తుంది. నిన్న కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కాల్ చేసి మాట్లాడారు. సీపీ రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని కోరగా.. జగన్ దీనికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం వైసీపీ పార్టీకి లోకసభలో నలుగురు, రాజ్యసభలో ఏడుగురు.. మొత్తంగా 11 మంది సభ్యులు ఉన్నారు.