
పటాన్ చెరు, క్రైమ్ మిర్రర్:- ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఎమ్డిఆర్ పౌండేషన్ మాదిరి పృథ్విరాజ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో చిన్నారుల కోసం నిర్వహించిన ఫీల్డ్ ట్రిప్ లో విద్యార్థులు సేంద్రియ వ్యవసాయం పట్ల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పటాన్ చెరు పట్టణంలోని జె.పి ఫార్మ్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్డిఆర్ ఫౌండేషన్ పృథ్వీరాజ్ సమక్షంలో, విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత, సేంద్రియ ఎరువుల వినియోగం, పంటల పెంపకం విధానాల గురించి వివరణాత్మకంగా తెలియజేయడం జరిగింది. చిన్నారులు స్వయంగా పంట పొలాలను సందర్శించి, వరి పంట, కూరగాయ పంటలు, కొబ్బరి, టేకు, జామ, మామిడి చెట్లు, ఉసిరికాయ, నిమ్మకాయ, మునక్కాయ, పాలకూర, తమలపాకు మొదలగునవి సేంద్రియ పంటలు ఎలా పండుతాయో నేర్చుకున్నారు. ఇలాంటి ఫీల్డ్ ట్రిప్స్ పిల్లల్లో ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించడమే కాకుండా, సుస్థిర వ్యవసాయం వైపు కొత్త తరం దృష్టిని మలుస్తాయని ప్రిథ్వీరాజ్ అన్నారు.
Read also : బి.ఆర్ గవాయి పై జరిగిన దాడి పై ఖండన
Read also : మునగాల MRO ఆఫీస్ అధికారులను సస్పెండ్ చేసిన కలెక్టర్ తేజస్..!