
యువత దేశానికి పట్టుకొమ్మలు, దేశ అభివృద్ధికి తోడ్పడాలి
“బాల్య వివాహాల వాళ్ళ కలిగే నష్టాలు, మానవ అక్రమ రవాణా ,అక్రమ దత్తత”
స్థానిక అంగన్వాడీ సూపర్వైజర్ లక్ష్మి
క్రైమ్ మిర్రర్ ప్రతినిది, మాడుగులపల్లి: నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండలము, ఇందుగల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో దామరచర్ల ప్రాజెక్టు సెక్టార్ స్థానిక అంగన్వాడీ సూపర్వైజర్ లక్ష్మి ఆధ్వర్యంలో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టి “పోషణ్ భీ, పధాయ్ భీ”, అలాగే “బాల్య వివాహాల వాళ్ళ కలిగే నష్టాలు, మానవ అక్రమ రవాణా ,అక్రమ దత్తత” మరియు” డ్రగ్స్” పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Also Read:Teenage Changes: టీనేజ్ అమ్మాయిలకు మీసాలు ఎందుకు వస్తాయో తెలుసా?
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…”పోషణ్ భీ, పధాయ్ భీ” అంటే “పోషణతో పాటు విద్య. ఇది మిషన్ సాక్షం అంగన్‌వాడీ మరియు పోషణ్ 2.0 కింద ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య కార్యక్రమం అని అన్నారు. డ్రగ్స్ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు,ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థులకు వివరించారు.

చాలామంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని కాబట్టి విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని అన్నారు. యువత దేశానికి పట్టుకొమ్మలని వారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలని సమాజాభివృద్ధికి తద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులకు సూచించారు.
Also Read:Droupadi Murmu: రేపు పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
ఒక వ్యక్తి డ్రగ్స్ కి అలవాటు అయితే మాన్పించడం చాలా కష్టమని డ్రగ్స్ వినియోగం వల్ల ఆ వ్యక్తి ఏం చేస్తాడో తనకే తెలియదని, మత్తులో నిద్రిస్తాడని, క్రూరమైన ఆలోచనలు కలిగి ఉంటాడని తెలియజేశారు. విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు అనుమానం వచ్చినా, విక్రయిస్తున్నట్టు తెలిసిన వెంటనే స్తానిక పోలీసులకు సమాచారం అందివాలని అన్నరు.

అప్పుడు మాత్రమే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్స్ నాగమణి, సునంద, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
Also Read:Shocking: ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న వరుడికి హ్యాండ్ ఇచ్చిన పెళ్లికూతురు
Also Read:Trump Junior: అంబానీ ఫ్యామిలీతో కలిసి ట్రంప్ కుమారుడి డ్యాన్స్