క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలం శనివారం రోజున మండల కేంద్రంలోని మహిళా సమైఖ్య భవనంలో ఎంఎస్ఎంఈ–ర్యాంప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిశ్రమల కేంద్రంలోని ఈడిసీ మేనేజర్ కుమ్మరికుంట్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ముద్ర యోజనపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్థానిక వ్యాపారులు,చిరు వ్యాపారులు,స్వయం ఉపాధి పొందే యువత మరియు మహిళలు హాజరయ్యారు. ఐఏల్‌వో ట్రైనర్ హేమాద్రి ముద్ర రుణాలైన శిశు,కిషోర్,తరుణ్ వివరాలు,అర్హతలు,పత్రాలు, రీపేమెంట్ వ్యాపారం ఎలా చేసుకోవాలి దానియొక్క విధి విధానాలపై అవగాహన కల్పించారు.లీడ్ బ్యాంక్ మేనేజర్ శివ రామకృష్ణ మాట్లాడుతూ అర్హులైన వారు సరైన పత్రాలతో బ్యాంకును సంప్రదిస్తే ముద్ర రుణాలు సులభంగా మంజూరు అవుతాయని బ్యాంకుల రుణాల విషయంలో బ్యాంకుల విధి విధానాలు షరతులు వివరించారు.ఎంఎస్ఎంఈ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలు పెంచడమే లక్ష్యమని,వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ఈడిసీ ని సంప్రదించాలని లీడ్ బ్యాంక్ ఆఫీసర్ వంశీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్ మాట్లాడుతూ కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు రుణాలు వ్యాపారాలపై అవగాహన వస్తుందని ఇక్కడ ఏర్పాటు చేయడం హర్షణీయం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజరు ప్రశాంత్ కుమార్, ఈడీసీ అసిస్టెంట్ మేనేజర్ బత్తినీ మహేష్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రచ్చ పల్లవి జ్ఞానేశ్వర్ , తదితరులు పాల్గొన్నారు.

