హైదరాబాద్ బోరబండ పరిధిలోని ఆటో డ్రైవర్ ను సినిమా స్టోరీ ని తలపించేలా హత్య చేశారు. ఈ హత్య ఏడాదిన్నర తర్వాత వెలుగులోనికి వచ్చింది. నిందుతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నగరంలో సంచలనంగా మారింది. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని నమ్మబలికి బాలిక కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్ ను.. పక్కాగా స్కెచ్ వేసి చంపేశారు బాలిక తల్లిదండ్రులు.
కూతురిని కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్ కి బాలిక తల్లిదండ్రులు స్కెచ్ వేశారు. స్నాప్ చాట్ ద్వారా భార్యతో కలిసి ఆటో డ్రైవర్ ను హనీ ట్రాప్ చేశారు. ఆటో డ్రైవర్ కుమార్ ను రహస్య ప్రదేశానికి పిలిచింది బాలిక తల్లి. అక్కడికి వెళ్లిన ఆటో డ్రైవర్ ను భర్తతో కలిసి హత్య చేసింది. హత్య చేసిన తర్వాత బండరాయితో కాళ్లు చేతులు కట్టిపడేసి నాగార్జునసాగర్ ఎడమ కాలువలో విసిరేసి వెళ్లారు బాలిక తల్లిదండ్రులు..
2023లో ఈ హత్య జరిగింది. అప్పట్లోనే కోదాడ పీఎస్ లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదైంది. 2023 మార్చి నెలలో జూబ్లీహిల్స్ పీఎస్ లో మిస్సింగ్ కేస్ గా నమోదైది. దీంతో కేసును కోదాడ నుంచి బోరబండకు బదిలీ చేశారు. ఆటో బంపర్ ను గుర్తుపట్టి నిందితులను పట్టుకున్నారు మృతుడి బంధువులు.హత్య కేసు వెలుగు చూడడంతో తల్లిదండ్రులను అరెస్టు చేశారు బోరబండ పోలీసులు.