
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు దంచి పడుతున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కొన్ని జిల్లాలకు సెలవులు కూడా ప్రకటించారు
1. కడప
2. చిత్తూరు
3. అన్నమయ్య
4. తిరుపతి
5. నెల్లూరు
ఈ ఐదు జిల్లాలలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. వాతావరణ శాఖ అధికారుల ప్రకటన మేరకు నేడు ఈ ఐదు జిల్లాలలో ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించడం జరిగింది. మరోవైపు ప్రకాశం జిల్లాలోను భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నా కూడా ఎందుకు సెలవులు ఇవ్వలేదని అధికారులను ప్రశ్నిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. తక్షణమే ప్రకాశం జిల్లా లోని స్కూళ్లకు కూడా సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు అధికారులు సెలవులు ప్రకటిస్తారా?.. లేదా?.. అనేది ప్రతి ఒక్కరికి ఉత్కంఠంగా మారింది.
Read also : శబరిమలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శనం – అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పణ
Read also : మైలార్ దేవుపల్లి పరిధిలో స్కూల్ బస్సులో మంటలు