
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య మొదటి టీ20 సిరీస్ ప్రారంభమయ్యింది. ఇందులో భాగంగానే ఈరోజు మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకోగా , టీమిండియా మొదటి బ్యాటింగ్ చేయనుంది. ఈ క్రమంలోనే ఈ మొదటి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వన్డే సిరీస్ కోల్పోయిన టీమ్ ఇండియా ఈ టి 20 సిరీస్ గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు. మరోవైపు వన్డే సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా టి20 సిరీస్ కూడా గెలిచి తమ సత్తా ఇది అని తెలియజేయడానికి వారు కూడా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. వన్డే మ్యాచ్లలో ఆడిన రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వారు ఆడడం లేదు.
Read also : సోషల్ మీడియా ట్రోల్ల్స్ పై దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన శ్రీ లీల
ఇండియా జట్టు :- అభిషేక్ శర్మ, గిల్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు సాంసన్, శివం దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
ఆస్ట్రేలియా జట్టు :- మార్ష్, ట్రావిస్ హెడ్ , జోష్ ఇంగ్లీష్, టీమ్ డేవిడ్, ఓవెన్, స్టయినిష్, ఫిలిప్, బాట్ లెట్, నాదన్ ఎల్లిస్, కుహనుమాన్, హేజల్ వుడ్





