
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :-
ఏపీ లిక్కర్ స్కాంలో అరబిందో ఫార్మా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ సంస్థ నుంచి వంద కోట్ల రూపాయల లోన్ ఇతర కంపెనీలకు ఇప్పించానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. అది లోన్ కాదు.. లోన్ రూపంలో లంచం అన్న ఆరోపణలు వస్తున్నాయి.అరబిందో కంపెనీలోకి లిక్కర్ స్కాం ప్రవహించినట్లుగా అనుమానిస్తున్నారు. ఆ కంపెనీ రుణాలు ఇచ్చిందో లేదో తెలియదు కానీ.. చెల్లింపులు మాత్రం జరిగాయని సీఐడీ అధికారులు గుర్తించారు. ఇప్పుడు అరబిందోను కాపాడటానికే విజయసాయిరెడ్డి రుణం అని కవర్ చేసే ప్రయత్నం చేశారు. సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా 45 కోట్లు అరబిందో వద్ద రుణం తీసుకున్నానని చెబుతున్నారు. కానీ ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి ఆ సంస్థలో బలవంతంగా చేరిన డైరక్టర్ మాత్రమే. ఆ డబ్బులు పెట్టుబడి పెట్టలేదు. అసలు ఎలా ఇచ్చారో.. ఎలా ఖర్చు పెట్టారో స్పష్టత లేదు. కానీ చెల్లింపులు చేశారు. లిక్కర్ స్కాంను వైట్ చేసే వ్యవహారంలో భారతి సిమెంట్స్, పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ తో పాటు అరబిందోను కూడా ఉపయోగించుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో ఫార్మా వారసుడు అయిన శరత్ చంద్రారెడ్డి అరెస్టు అయినప్పుడు ఆ సంస్థ షేర్లు భారీగా పతనం అయ్యాయి. అప్పుడు ఆయనను కంపెనీలోని బాధ్యతల నుంచి తప్పించారు. అరబిందో పేరుతో ఆ శరత్ చంద్రారెడ్డి చేస్తున్న ఇతర వ్యాపారాల పేర్లను మార్చాలని వాటాదార్లు ఒత్తిడి చేశారు. దాంతో ఆయనతో కంపెనీ పేరును ఔరో రియాలిటీ అని మార్చుకున్నారు. ఆ స్కాంతో నేరుగా అరబిందో ఫార్మాకు సంబంధం లేకుండా పోయిది. కానీ ఏపీ లిక్కర్ స్కాంతో మాత్రం నేరుగా సంబంధం ఏర్పడిపోయింది.
లిక్కర్ స్కాం కంపెనీలకు అప్పుగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి ? ఆ లిక్కర్ స్కాం డబ్బుల్ని మళ్లీ తమ ఖాతాల్లో వేసుకోవడం ఎందుకు అన్న ప్రశ్నలు వస్తాయి. ఏపీ దర్యాప్తు సంస్థలు అరబిందో పై దృష్టి పెట్టినప్పుడు.. ఒక వేళ ఐటీ,ఈడీ లు రంగంలోకి దిగితే.. వాటి దర్యాప్తులు ప్రారంభమైనప్పుడు అరబిందోఫార్మాకు గడ్డు పరిస్థితి తప్పకపోవచ్చు.
రెండు రాష్ట్రాల్లో.. ఈ 13 ప్రదేశాల ప్రజలు జాగ్రత్త!.. ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం?