సికింద్రాబాద్లోని కుమ్మరిగూడ రణరంగాన్ని తలపించింది. కుమ్మరిగూడ ముత్యాలమ్మ టెంపుల్లో అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా హిందూ సంఘాలు బంద్ ఉద్రిక్తతలకు దారి తీసింది. పెద్ద ఎత్తున హిందూ సంఘాల నాయకులు అమ్మవారి ఆలయానరికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఆలయం వెనకాల ఉన్న మసీదు వైపు చొచ్చుకెళ్లేందుకు కొందరు ప్రయత్నించడంతో పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య తీవ్ర వాగాద్వం చోటు చేసుకుంది. అదుపు తప్పడంతో నిరసకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తీవ్ర ఆగ్రహానికి గురైన నిరసనకారులు పోలీసులపై రాళ్లు, చెప్పులు రువ్వారు. సికింద్రాబాద్‌లో బస్సు అద్దాలు పగలగొట్టారు. దాంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సికింద్రాబాద్ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
ముత్యాలమ్మ గుడి దగ్గర జరిగిన లాఠీచార్జ్ పై నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ వివరణ ఇచ్చారు. హిందు సంఘాలు బంద్ శాంతియుత బంద్ కు పిలుపునిచ్చాయని.. 3000 మంది పబ్లిక్ తో ర్యాలీ జరిగిందని చెప్పారు. ర్యాలీలో 2 గ్రూపులు గా విడిపోయి ఒక గ్రూప్ హోటల్ దగ్గర, ఒక గ్రూప్ దేవాలయం దగ్గర గుమిగూడారని డీసీపీ తెలిపారు. అయితే ముత్యాలమ్మ దగ్గర ఉన్న జనాలు దగర్లో ఉన్న మజీద్ దగ్గర దాడి చేసే ప్రయత్నం చేశారని.. పోలీసులం ఎంత సర్ది చెప్పిన హిందు సంఘాల కార్యకర్తలు వినలేదని వెల్లడించారు.
కాలనీవాసులు సపోర్టు చేశారు.. కానీ కొంత మంది యువకులు పోలీస్ ఫోర్స్ పై రాళ్లు ,చెప్పులు, కుర్చీలతో పోలీసులపై దాడి చేశారని డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ తెలిపారు. రాళ్ల దాడిలో 12 మంది పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయని.. పరిస్థితి అదుపు తప్పే పరిస్థితి రావడంతో కంట్రోల్ చేయడానికి లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చిందని వివరించారు. లాఠీ ఛార్జ్ పై పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి… అందుకే నిజాలు తెలియడానికే మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు డీసీపీ.
ఇవి కూడా చదవండి ..