
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా “ఎన్డిటీవీ- యువ” కాన్ క్లెవ్ లో భాగంగా భారతదేశంలోనూ నేపాల్ తరహా పరిస్థితులు రావొచ్చని కేటీఆర్ చెప్పుకొచ్చారు. వరుసగా ప్రభుత్వాలు విఫలమైనప్పుడు నేపాల్ తరహాలో భారత దేశంలోనూ జనరేషన్-Z ఉద్యమం పక్కగా వస్తుంది అనడంలో ఎటువంటి సందేశం లేదు అని అన్నారు. దీంతో వెంటనే ఈ షో యాంకర్ తో పాటుగా అక్కడ ఉన్న యువత అందరూ కూడా షాక్ అయ్యారు. వెంటనే యాంకర్ కలుగ చేసుకునీ కేటీఆర్ మాటలను మీరు సమర్థిస్తున్నారా?.. మన భారతదేశంలోనూ కూడా నేపాల్ లాంటి పరిస్థితులు వస్తాయని ఎంతమంది అనుకుంటున్నారో చేతులు ఎత్తండి అని అడగగా ప్రతి ఒక్కరు కూడా నో అని చేతులెత్తారు. అప్పటివరకు కేటీఆర్ ఇక్కడున్న యువతను ‘నో’ చెప్పరని ధీమా వ్యక్తం చేశారు. కానీ అంతలోపే ప్రతి ఒక్కరూ నో అని చేతులెత్తడంతో కేటీఆర్ కూడా అవాక్కయ్యారు.
Read also : చిప్స్ అయినా.. షిప్స్ అయినా మన ఇండియాలోనే తయారవ్వాలి : ప్రధాని మోడీ
ఇక వెంటనే కేటీఆర్ సరే ‘భవిష్యత్తులో చూద్దాం’… అని షాకింగ్ లో ఉండగానే ఈ మాట చెప్పుకొచ్చారు. నేపాల్ యువత అందరూ కూడా తమ ఫ్యూచర్ కోసం చాలానే ఉద్యమాలు చేశారు అని కేటీఆర్ ఈ షో ద్వారా చెప్పుకొచ్చారు. మన భారతదేశంలోని యువత అందరూ కూడా భవిష్యత్తులో పరిస్థితులు మారిపోతే ఇలాంటి ఉద్యమాలు చేయాలని కోరారు. భారతదేశానికి వెన్నుముక యువత… అలాంటప్పుడు యువతకు కావలసినటువంటి సదుపాయాలు మనం కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం గురించి కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. కేటీఆర్ మన భారతదేశంలో నేపాల్ లాంటి పరిస్థితులు వస్తాయని కోరుకుంటున్నారు అనుకుంటా అని.. చాలా మంది యువత సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది మోడీ ఉన్నంతవరకు ఏ ఆపద మన దేశానికి రాదని అంటున్నారు. మరి ఫ్యూచర్లో భారత్ ఎలాంటి స్థాయిలో ఉంటుందో.. మనదేశంలో కూడా నేపాల్ పరిస్థితులు వస్తాయా రావా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also : అనస్తేషియా హైడోస్.. నిండు ప్రాణం బలి..!