
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్ అడ్డా అయినటువంటి పులివెందుల ZPTC ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ మరియు వైసీపీ పార్టీల నాయకుల మధ్య కవింపు మాటలతో ఘర్షణలు జరగగా ఇందులో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు తీవ్ర గాయాలు పాలవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తాజాగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. సీఎం చంద్రబాబుపై అలాగే కూటమిపాలనపై జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు అధికారం ను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. అధికారం ఉందని రౌడీ రాజకీయాలు చేస్తున్నారని జగన్ తీవ్రంగా మండిపడ్డారు.
పులివెందుల జిల్లాలోని నల్లగొండువారిపల్లి వద్ద బీసీ, యాదవ సామాజిక వర్గానికి చెందిన తమ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సహా వేముల మండల పార్టీ పరిశీలకుడు వేల్పుల రామలింగారెడ్డి పై టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ అన్యాయాన్ని మేము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి చాలా రోజులు అవుతున్న కూడా.. ప్రతిరోజు కూడా కొద్ది రోజుల్లోనే ఎలక్షన్లు జరగబోతున్నాయి.. కాబట్టి మాటలు యుద్ధం జరగాల్సిందే అని అన్నట్లుగా ఇరు పార్టీలు కూడా హైలెట్గా నిలుస్తున్నాయి. ప్రతిరోజు కూడా ఏదో ఒక టాపిక్ రాష్ట్రంలో ఇరు పార్టీల మధ్య హైలైట్ అవుతుంది. కాగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం మాజీ వైసీపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ కూడా చేయించడం జరిగింది. మరోవైపు రేపో మాపో మేము అధికారంలోకి వస్తాం.. అప్పుడు వడ్డీతో సహా మొత్తం తిరిగి చెల్లిస్తామని జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో భవిష్యత్తులో రాజకీయాలు ఎలా ఉండబోతాయి అనేది ప్రజలకు కూడా అర్థం కాకుండా పోయింది.
Read alao : కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్న కోమటిరెడ్డి? – ప్రభుత్వాన్ని ప్రజల కాళ్ల దగ్గరకు తీసుకొస్తా!
Read also: రాహుల్ ను PM చేస్తాం.. బీసీలకు రిజర్వేషన్లు సాధించుకుంటాం : సీఎం
yetu potondi mana samajam