
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఈరోజు భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో మాజీ స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నటువంటి వారందరూ కూడా 2027 వన్డే వరల్డ్ కప్ లో ఆడించాలని కోరారు. ఇక 2027 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా రోహిత్ శర్మ మరియు కోహ్లీ ఓపెనింగ్ చేయాలని సూచించారు. ఆ తరువాత స్థానాల్లో ఋతురాజ్ మరియు శ్రేయస్ అయ్యర్ ఆడాలి అని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పేర్కొన్నారు. రెండవ వన్డే ఋతురాజు గైక్వాడ్ అద్భుతమైన సెంచరీ చేయగా… ఈ యువ బ్యాట్స్మెన్ కు వరుసగా అవకాశాలు ఇవ్వాలి అని సూచించారు. అయితే ఇదే సందర్భంలో ప్రస్తుత కెప్టెన్ గిల్ పేరును మర్చిపోయారు. ఈ విషయాన్ని చాలా సేపు తర్వాత గుర్తించిన అశ్విన్ తన తర్వాత డిస్కషన్ లో సారీ నేను గిల్ ను మర్చిపోయాను.. ప్రస్తుతం టీమిండియా జట్టులో చోటు దక్కించుకోవడం అనేది అసాధ్యమని.. కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉన్న సందర్భంలో.. నేను మాత్రం ఋతురాజు గైక్వాడ్ ఆడాలి అని కోరుకుంటున్నాను అని అశ్విన్ తెలిపారు. కాగా గిల్ గాయం కారణంగా మ్యాచ్ ఆడని విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అతని స్థానంలో ప్రస్తుతం యువ ఆటగాడు జైశ్వాల్ ఆడుతున్నారు. మరి 2027 వన్డే వరల్డ్ కప్ లో ఏ ప్లేయర్లను తుది జట్టులోకి తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.
Read also : తెలుగు హీరోతో మీనాక్షి చౌదరి పెళ్లి.. క్లారిటీ
Read also : వెండిని భారీగా అమ్ముతున్న ప్రజలు.. ఎందుకంటే?





