చాలామంది కూడా ప్రస్తుత రోజుల్లో వివిధ కారణాల వల్ల మరణిస్తున్న సందర్భాలు మనందరికీ తెలిసిందే. అయితే రెండు నెలల్లో 70 మంది దాకా చనిపోయారని ఊరినే వదిలిపెట్టి ఊరు శివారులోకి వెళ్లిపోయారు గ్రామస్తులంతా. ఇక అసలు విషయానికి వస్తే నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి గ్రామ పొలిమేర దాటి వెళ్లిపోయారు.
ఈ విషయం తాజాగా వెలుగులోకి రాగా ఏడాది కాలంలోనే దాదాపు చాలామంది చనిపోయారని గ్రామానికి ఏదో శని పట్టుకుందని అందరు కూడా అనుకోని గ్రామస్తులందరూ కలిసి ఒకరోజు పొలిమేర అవతలే ఉండాలని నిర్ణయించుకొని రాత్రికి రాత్రి సద్దుకొని వెళ్లిపోయారు. తెల్లవారు గానే కల్లాపు కూడా చల్లకుండా ఉన్నటువంటి ఫోటోలు మనకి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రతి ఇంటికి తాళం వేసి అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు కూడా తాళం వేసి ఉండడం వల్ల గ్రామమంతా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఈ గ్రామంలో మొత్తం 1250 కుటుంబాలు ఉండగా దాదాపుగా 5500 మంది నివసిస్తున్నారట. చనిపోయిన వాళ్లలో ఎక్కువగా యువకులే ఉండడం వల్ల గ్రామస్తులందరూ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
Read More : కొడుకు తిండి పెట్టడం లేదంటూ ఆర్డీవో కాళ్లు మొక్కిన తల్లి