
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుపై జగన్మోహన్ రెడ్డి స్పందించారు. మొంథా తుఫాన్ అలాగే నిన్న శ్రీకాకుళంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనను పక్కదోవ పట్టించడానికి మాత్రమే జోగి రమేష్ ను ఇప్పటికిప్పుడు అరెస్టు చేశారు అని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ప్రమేయం లేకపోతే భయం ఎందుకు అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ ను జగన్ పూర్తిగా ఖండించారు. ఒక వైపు తుఫాన్ కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు నిన్న శ్రీకాకుళం కాశీబుగ్గ దేవాలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా కూటమి ప్రభుత్వం విఫలమయింది అని… దీనిపై ప్రజలు తీవ్రంగా ఆగ్రహిస్తుండగా… ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని.. ఈ ఘటనలను పక్క ద్రోవ పట్టించడానికే జోగి రమేష్ ను మరుసటి రోజే అరెస్ట్ చేశారు అని జగన్ ఆరోపించారు. నకిలీ మద్యంపై సిబిఐ విచారణ కోరుతూ రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటి రోజునే అరెస్ట్ చేశారు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతలా భయపడుతున్నారో స్పష్టంగా అర్థమవుతుంది అని జగన్ అన్నారు. మీ ప్రమేయం ఏమీ లేకుంటే విచారణకు భయమెందుకు అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఏం చెప్తే అది జరుగుతుంది అని.. మా టైం కూడా వస్తుంది అని జగన్ ఒక వీడియోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై రాష్ట్రంలో మళ్లీ రాజకీయ వైరం మొదటికే వచ్చింది. ఇరు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు ప్రారంభించారు.
Read also : రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించిన కిషన్ రెడ్డి, కేటీఆర్..!
Read also : టెస్లా.. టెస్లా.. త్వరలోనే ఎగిరే కార్లు వస్తాయంట?





