Tuesday, March 17, 2026
Homeతెలంగాణనేరాల నియంత్రనలో పకడ్బందీ చర్యలు.. మాడ్గుల సీఐ వేణుగోపాల్ రావు పై ప్రజలు ప్రశంసల...

నేరాల నియంత్రనలో పకడ్బందీ చర్యలు.. మాడ్గుల సీఐ వేణుగోపాల్ రావు పై ప్రజలు ప్రశంసల వర్షం

రంగారెడ్డి,క్రైమ్ మిర్రర్:- మాడ్గుల మండలంలో గతంలో కన్నా ప్రస్తుతం నేరాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఈ మార్పుకు ప్రధాన కారణంగా సీఐ వేణుగోపాల్ రావు తీసుకున్న కఠినమైన పద్ధతి బద్ధమైన చర్యలేనని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.పదవి చేపట్టినప్పటి నుంచి సీఐ వేణుగోపాల్ రావు శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టి, రాత్రివేళల్లో కఠినమైన పెట్రోలింగ్ నిర్వహించడం, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై వెంటనే చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.అదేవిధంగా గ్రామాల్లో ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన కల్పించడం, సమస్యలను ప్రత్యేక్షంగా తెలుసుకుని తక్షణ పరిష్కారం చూపడం ద్వారా పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది.గతంలో ఉన్న పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. నేరాలు తగ్గడం సీఐ గారి కృషి ఫలితమే అని మండల ప్రజలు ప్రశంసిస్తున్నారు.
సీఐ వేణుగోపాల్ రావు నీతృత్వంలో మాడ్గుల మండలంలో శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతున్నాయని మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పాటలో పచ్చి బూతులు.. వివాదంలో మంగ్లీ

ఘనంగా మంచు లక్ష్మి కూతురి ఓణీల వేడుక

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments