
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- ప్రస్తుత రోజుల్లో చాలామంది ఏదో ఒక పరిస్థితి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితులలో పక్కన ఎవరూ లేకపోతే కచ్చితంగా వారి ప్రాణాలకే ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. నేరాలు, ఘోరాలు జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలో ఎవరికీ అర్థం కాదు. అలాంటప్పుడు పోలీసులకు కాల్ చేయడం చాలా మంచిది. అలాగే గర్భిణీ స్త్రీలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పురిటి నొప్పులు వచ్చిన లేదా ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాంటి సమయంలో అంబులెన్స్ కు ఫోన్ చేయడం చాలా అవసరం. ఇంకోవైపు ప్రస్తుత రోజుల్లో భారీగా మోసాలు జరుగుతున్నాయి. అవి ఆన్లైన్ పరంగా నూ లేదా ఆఫ్లైన్ పరంగానూ ఎన్నో వింతలు చూస్తున్నాము. ఇలాంటి అప్పుడే చాలా మంది ఆత్మహత్యలు లేదా సాధారణంగా ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఎమర్జెన్సీ నెంబర్లను ఎప్పుడో ప్రకటించారు. కానీ ఈ ఎమర్జెన్సీ నెంబర్లు కొంతమందికి తెలిసినా మరి కొంతమందికి తెలియకపోవచ్చు.
Read also : కుక్క గోరు గుచ్చుకొని యువకుడు మృతి!
ఎమర్జెన్సీ నెంబర్లు
1. 112 – ఏ పరిస్థితుల్లోనైనా ఈ నెంబర్కు కాల్ చేయొచ్చు. ( పోలీసులు, ఫైర్ ఇంజన్, అంబులెన్స్)
2. 100 – పోలీసులు
3.101 – అగ్ని ప్రమాదాలు అలాగే గ్యాస్ లీకేజీలు
4.102 – గర్భిణీ స్త్రీలకు అలాగే పిల్లలకు ఉచితంగా అంబులెన్స్ సదుపాయం
5. 108 – ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ అయినా కాల్ చేయొచ్చు.
6. 1091 – ఎవరైనా మహిళలు వేధింపులకు గురైతే వెంటనే కాల్ చేయండి.
7. 1930 – ఎవరైనా మోసాలకు లేదా స్కాములకు గురైతే కాల్ చేయండి
Read also : ఆదిభట్లలో పోక్సో కేసు నమోదు.. రిమాండ్ కు నిందితుడు తరలింపు!