
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ :- ప్రస్తుత రోజుల్లో ఏ కష్టం వచ్చిన, నష్టం వచ్చిన వెంటనే దేవాలయాలకు వెళ్లి తమ కోరికలను దేవుడికి చెబుతూ ఉంటారు. అయితే గుడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. కానీ అలా చేయడం ద్వారా దేవుడు దివ్య స్వరూపాన్ని మనసారా చూడలేమని కొంతమంది పండితులు చెప్తున్నారు. ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు తీర్చాలని చెప్పి గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని దేవుడిని ప్రార్థించడం మానుకోవాలని సూచించారు. గుడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ దేవుడిని మనసారా చూడకుండా, దైవానుభూతిని పొందకుండా బయటకు వస్తే దర్శన భాగ్యానికి అర్థం లేదంటున్నారు వేద పండితులు. మన కోరికలు తీర్చడానికి సర్వాభరణాలతో, మనోహరమైనటువంటి రూపంలో స్వామి వారు కొలువై ఉంటారు. కాబట్టి దేవాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా తమ కోరికలను అలాగే కష్టాలను చెప్పుకుంటూ కళ్ళు తెరిచే దైవ రూపాన్ని వీక్షించాలి అని చెప్తున్నారు. కాబట్టి మరోసారి దేవాలయానికి వెళ్తే తప్పకుండా స్వామివారిని రెండు కళ్ళతో వీక్షిస్తూ తమ కోరికలను చెప్పుకోవాలి అని పండితులు భక్తులకు సూచించారు. అలా చేయని పక్షంలో గుడికి వెళ్ళినా ఒకటే.. వెళ్లకపోయినా ఒకటే అని పండితులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి దేవాలయానికి వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించాలని కోరారు.
Read also : తక్షణమే మా దేశం నుంచి వెళ్ళిపోండి.. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు
Read also : పాక్ దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మృతి.. పిరికిపంద చర్యగా భావిస్తున్నాం!