
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీశైలం పుణ్యక్షేత్రం మరియు కృష్ణానది డ్యాం ఎంత ప్రసిద్ధి చెందినవో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీశైలంకు నిత్యం చాలామంది భక్తులు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కొంతమంది మల్లికార్జున స్వామి దేవాలయ దర్శనంకు మరి కొంతమంది కృష్ణానది డ్యాం చూడడానికి ప్రతిరోజు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో పర్యాటకులు వెళ్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులు అయితే శ్రీశైలం వెళ్లాలంటే కచ్చితంగా దోర్నాల మరియు శ్రీశైలం రహదారిలో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ఇకపై ఈ అటవీ ఘాట్ రోడ్లో ప్రయాణించాలంటే తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాల్సిందే అని అధికారులు తాజాగా వెల్లడించారు.
Read also : నేపాల్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొస్తున్నాం : నారా లోకేష్
శ్రీశైలం వెళ్లే భక్తులు పాటించాల్సిన సూచనలు :-
శ్రీశైలం రహదారిలో వెళ్లే భక్తులకు ఫారెస్ట్ రేంజర్ హరి కొన్ని కీలక సూచనలు చేశారు. రాత్రి వేళల్లో అడవి జంతువులు ఘాట్ రోడ్ దాటుతున్నాయని… కాబట్టి రాత్రివేళ 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎటువంటి వాహనాలకు కూడా అనుమతి లేదని తెలిపారు. సాధారణంగా ఘాట్ రోడ్ లో 30 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువగా వెళితే 500 రూపాయలు ఫైన్ విధిస్తామని అన్నారు. ప్లాస్టిక్ రోడ్లపై పడేసిన… అడవి ప్రాంతంలోని ఏదైనా చెట్టుకు లేదా మొక్కలకు నిప్పు పెట్టిన వెయ్యి రూపాయలు ఫైన్ విధిస్తామని ఫారెస్ట్ అధికారి హెచ్చరించారు. ఎవరూ కూడా అటవీ ప్రాంతంలో ప్రయాణించేటప్పుడు మద్యం సేవించి వాహనాలను నడపరాదని.. పొరపాటున అలా చేసినట్లయితే ఫైన్ తో పాటు వేరే శిక్షలు కూడా అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాబట్టి శ్రీశైలం మార్గాన వెళ్లే ఎవరైనా సరే హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించి ప్రయాణించాలని కోరారు. ఇవి పాటించని యెడల కచ్చితంగా ఫైన్ లేదా శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని సూచించారు.
Read also : సీఎం గుడ్ న్యూస్… ఆటో డ్రైవర్లకు దసరాకి డబుల్ పండుగే!