
క్రైమ్ మిర్రర్, లైఫ్ స్టైల్ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అధికంగా నీరు త్రాగుతూ ఉన్నారు. చాలామంది వైద్యులు ప్రతిరోజు కూడా ఎక్కువగా నీరు త్రాగండి అని సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ రోజుకి కొన్ని లీటర్లు మాత్రమే నీళ్లు తాగాలని… అధికంగా త్రాగిన ప్రమాదమే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా డాక్టర్లు తెలిపిన విషయం ప్రకారం… పురుషులు ప్రతి రోజుకు మూడు లీటర్ల, అదే స్త్రీలు అయితే 2.5 లీటర్ల నీళ్లు తాగాలని ICMR తాజాగా ఒక రీసెర్చ్ ప్రకారం పేర్కొంది. మరోవైపు మహిళలు గర్భిణీలు అయిన సందర్భంలో లేదా పాలిచ్చే తల్లులు అదనంగా 0.5 నుంచి 1 లీటర్ వరకు నీరు త్రాగవచ్చని పేర్కొన్నారు. అలా కాదు అని మరీ ఎక్కువగా నీరు త్రాగితే మాత్రం అధిక ప్రమాదం కలగకపోయినా మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది అని పేర్కొన్నారు. అలాగే రక్తంలో సోడియం సాంద్రత కూడా తగ్గుతుంది అని డాక్టర్లు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మరి కొంతమందికి దీర్ఘకాలిక డయాబెటిస్, బీపీ అలాగే మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగితే మాత్రం ప్రమాదమే అని… కాబట్టి ఈ మూడు అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఒకేసారి ఎక్కువ నీళ్లు త్రాగకూడదని వైద్యులు హెచ్చరించారు. కాబట్టి భూమ్మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా దీని గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. మనిషి ఆరోగ్యానికి ఏదీ కూడా అధికంగా ఉపయోగించకూడదని సూచించారు.
Read also : జన్మదిన శుభాకాంక్షలు హార్దిక్ భాయ్.. సోషల్ మీడియాలో విషెస్ వెల్లువ!
Read also : 14 న రాష్ట్ర బంద్ కు రాజకీయ పార్టీలన్నీ మద్దతు ఇవ్వాలి : బీసీ నేత