Monday, March 16, 2026
Homeజాతీయంసిగరెట్, మద్యం విచ్చలవిడిగా తాగుతున్నారా?.. ఇది మీకోసమే!

సిగరెట్, మద్యం విచ్చలవిడిగా తాగుతున్నారా?.. ఇది మీకోసమే!

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఈ మధ్యకాలంలో మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు మద్యానికి బానిసవుతున్నారు. మనదేశంలో ఈరోజు మరీ ముఖ్యంగా యువత మద్యం తాగుతూ, సిగరెట్లు కాల్చుతూ వారి ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాకుండా పక్కవారి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నారు. తల్లిదండ్రులు, వైద్య నిపుణులు చివరికి అధికారులు సైతం వీటిపై ఎన్నిసార్లు అవగాహన కల్పించినా కూడా యువత మారడం లేదు. మద్యానికి బానిస అయ్యి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తాజాగా వైద్యులు తెలిపిన మరో అధ్యయనం ప్రకారం ఎక్కువగా మద్యం మరియు సిగరెట్లు తాగితే మతిమరుపు వస్తుంది అని తేల్చి చెప్పారు.వయసుతో సంబంధం లేకుండా కొన్ని అలవాట్లను అలవర్చుకోవడంతో మెదడు పరిమాణాన్ని తగ్గిస్తుంది అని హెచ్చరించారు. సరిగ్గా నిద్రపోకపోవడం, ఎక్కువ ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు వ్యాయామం చేయకపోవడం, పనుల నిమిత్తం ఒత్తిడి కారణంగా మెదడు వేగంగా పనిచేయడం తగ్గిపోతుంది. విటమిన్ బి 12 లోపం, తీవ్రమైన ఒత్తిడి, ఒంటరితనం ధూమపానం వంటి వాటి కారణంగా కూడా మెదడు వేగంగా పనిచేయదు అలాగే మతిమరుపు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కాబట్టి ప్రతిరోజు కూడా వ్యాయామం, పౌష్టికాహారం, సరైన నిద్ర వంటివి చేయడం వల్ల మెదడు వేగాన్ని సురక్షితంగా ఉంచుకోగలమని.. లేదంటే మెదడు ప్రతిరోజు కూడా క్షీణించిపోతుంది అని.. చివరికి మతిమరుపు మనిషి అయిపోతారని వెల్లడించారు.

ఇండియాలో “మైగ్రేన్” విధ్వంసం.. హెచ్చరిస్తున్న వైద్యులు?

తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్షాలు….ఆరు జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్‌…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments