
తెలంగాణ కేబినెట్ విస్తరణ…. వార్తల్లోనే తప్ప.. ఆచరణలో లేదు. అదిగో.. ఇదిగో అన్నారు… ఇప్పుడు అటకెక్కించేశారు. ప్రస్తుతం ఎవరి నోటా… ఆ మాట వినిపించడంలేదు. అసలు… మంత్రివర్గ విస్తరణకు ఎందుకు బ్రేక్ పడింది..? ఎవరి వల్ల.. పక్కన పెట్టాల్సి వచ్చింది…? అంటే… ఇద్దరి పేర్లు ప్రముఖుంగా వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరి వల్లే… కేబినెట్ విస్తరణ జరగడంలేదట. ఇంతకీ ఎవరా ఇద్దరు..? ఏం చేశారు..?
ఇద్దరిలో ఒకరు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మరొకరు గడ్డం వివేక్… ఆ ఇద్దరి వల్లే కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడిందట. అంతా వీరిద్దరి వల్లే అన్న మాట గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తోంది. అసలు ఏం జరిగిందంటే… తెలంగాణ కేబినెట్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు 12 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో నాలుగింటిని భర్తీ చేయాలని కాంగ్రెస్ భావించింది. పార్టీ పెద్దలతో మాట్లాడి పేర్లు కూడా ఫైనల్ చేసినట్టు వార్తలు వచ్చారు. నాలుగింటిలో రెండు మంత్రి పదవులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్‌కు ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది. దీంతో.. వారికి మంత్రి పదవులు ఇవ్వడంపై కొందరు పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారని సమాచారం. ఆ ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారట. దీంతో… కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడినట్టు సమాచారం.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిది రెడ్డి సామాజికవర్గం. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. ఇద్దరు సోదరులకు మంత్రి పదవులు ఇస్తే.. మిగిలిన వారి సంగతేంటని… ఆశావహులు ప్రశ్నిస్తున్నారట. ఇక.. గడ్డం వివేక్… ఆయన ఇంట్లో ముగ్గురు పదవులు అనుభవిస్తున్నారు. అలాంటప్పుడు… వివేక్‌కు మంత్రి పదవి ఎలా ఇస్తారని కేడర్ ప్రశ్నిస్తోందట. అంతేకాదు.. వీరిద్దరికీ పదవులు ఇస్తే.. సామాజిక సమీకరణాలు కూడా దెబ్బతింటాయని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే… తెలంగాణ కేబినెట్‌లో రెడ్డి సామాజికవర్గం బాగానే ఉంది. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే… ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. ఇక… గడ్డం వివేక్.. మాల సామాజికవర్గానికి చెందిన నేత. ప్రస్తుత కేబినెట్‌లో మాల సామాజికవర్గం నేతలు ఉన్నారు. మళ్లీ అదే సామాజిక వర్గం నేతకు పదవికి ఇస్తే.. మాదిగ సామాజికవర్గానికి అవకాశం ఉండదు. దీనిపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్‌కు మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చి.. ఎన్నికల ముందు వారిని పార్టీలో చేర్చుకుంది కాంగ్రెస్. వారిద్దరికీ మంత్రి పదవులు ఇవ్వకపోతే ఎలా రియాక్ట్ అవుతారు..? ఇస్తే.. మిగిలిన నేతలు ఊరుకుంటారా..? అనే లెక్కలు తేలక… కేబినెట్ విస్తరణను ప్రస్తుతానికి పక్కనపెట్టేశారని సమాచారం.