
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అంటే ప్రస్తుతం ప్రత్యర్థి జట్టులకు వణుకు పుడుతుంది. ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అంటే కచ్చితంగా 220 పైగా పరుగులు చేయాల్సిందే. ఆ జట్టు ఓపినర్లు అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ ఇద్దరు కలిస్తే ప్రత్యర్థులకు చుక్కలే అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ మధ్యకాలంలో ఆ జట్టు 300 పరుగులను సునాయసంగా పూర్తి చేసే దిశలో పయనిస్తుంది. ఇప్పటికే 250 అలాగే 290 వంటి పరుగులు రెండు మూడు సార్లు చేసింది. ఇక నిన్న జరిగినటువంటి మినీ వేలంలో కూడా ఎస్ఆర్హెచ్ జట్టు మరింత డేంజరస్ హిట్లర్లను కొనుగోలు చేసింది.
Read also : మెస్సి ఇండియా రాకతో.. ఓ మంత్రి పోస్ట్ ఊస్టింగ్?
లివింగ్ స్టోన్, కార్స్, జాక్ ఎడ్వర్డ్స్ వంటి డేంజరస్ ఆటగాళ్ళను కొనుగోలు చేయడంతో ప్రస్తుతం సన్రైజర్స్ జట్టు మరింత బలంగా మారింది. ఇప్పటికే అభిషేక్ శర్మ, హెడ్, హెన్రిచ్ క్లాసన్ మరియు ఇషాన్ కిషన్ తో టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. ఇక ఆ తరువాత లివింగ్ స్టోన్, ఎడ్వర్డ్స్ మరియు నితీష్ కుమార్ రెడ్డి వంటి ప్లేయర్స్ తో మిడిల్ ఆర్డర్ కూడా చాలా బలంగా ఉంది. గత సంవత్సరం ఐపిఎల్ లో మిస్ అయినటువంటి 300 స్కోర్ ఈసారి పక్కాగా చేస్తుంది అని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చాలా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈసారి ఐపీఎల్ లో ఏ జట్టు 300 పరుగులు చేయగల సత్తా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also : All Time Record: సర్పంచ్ ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.1.50 లక్షలు!





