
-
అందాల పోటీల కు అడ్డుపడతారని ఐద్వా నాయకుల అక్రమ అరెస్టులు
-
మహిళా సంఘం నాయకురాలు బత్తుల జయమ్మ
చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్: దేశం ఒక ప్రక్క ఉగ్రవాద దాడులతో అతలాకుతలమవుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాదులో ప్రపంచ సుందరి అందాల పోటీలు నిర్వహించడం మహిళల విలువలను దిగజార్చే విధంగా వ్యవహరిస్తుందని మహిళా సంఘం నాయకురాలు బత్తుల జయమ్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం.(ఐద్వా) అందాలకు పోటీలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తారని ముందస్తు చర్యగా చౌటుప్పల మహిళా సంఘం నాయకురాలను ముందస్తుగా అక్రమ అరెస్టులు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులు చేయడం ప్రభుత్వ చేతకానితనమని మహిళా సంఘం నాయకురాలు బత్తుల జయమ్మ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అనేక హామీలు ఇచ్చి అధికారం రాగానే హామీలను మరిచారని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.