
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నగర మోగిన తర్వాత ప్రతి ఒక్క నాయకుడు కూడా వారికి నచ్చినట్లు ఆఫర్లు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఇక తాజాగా కొంతమంది నాయకులు తమ పార్టీ వ్యక్తి సర్పంచుగా ఏకగ్రీవమైతే ఆ గ్రామ అభివృద్ధికి పది లక్షల నుంచి 30 లక్షలు వరకు ఇస్తామంటూ ఆఫర్లు ఇవ్వడం ప్రస్తుతం కొత్త చర్చకు దారి తీస్తుంది. సాధారణంగా ఈ సర్పంచ్ ఎన్నికలు అనేవి ప్రజలు ఓట్లు వేసి గెలిపించాల్సి ఉంటుంది. కానీ ప్రజల ఓట్లతో గెలిస్తే నిధులు ఇవ్వరా?.. అంటూ చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. మరి కొంతమంది అయితే ఏకగ్రీవ ప్రస్తావన చట్టాల్లో ఉన్నప్పటికీ మా ఓటుకు విలువ లేదా?.. అంటూ నిలదీస్తున్నారు. ఇంకా వైపు ప్రజలందరూ కూడా ఏకమై గ్రామంలోని పెద్దలు ఏకగ్రీవాలు చేసుకుంటే తమకు వచ్చిన వ్యక్తిని ఎంచుకునే హక్కు ప్రజలు కోల్పోవడం సమంజసమా అంటూ?.. మరికొన్ని విధాలుగా ప్రశ్నలు సంధిస్తున్నారు. గ్రామ అభివృద్ధికి పది నుంచి 30 లక్షలు ఏకగ్రీవమైతే కానీ ఇవ్వను అంటున్నారా?.. ఇలా అయితే ఇక ఓటుకు విలువ ఏముంటుంది అని ప్రశ్నిస్తున్నారు. మరి రాజకీయ నాయకులు ఈ ఆఫర్లు ప్రకటించడం పట్ల మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.
Read also : Agniveers: ఏడాదికి లక్ష మంది అగ్నివీర్‌లు, కేంద్రం కీలక నిర్ణయం!
Read also : BCs Protest: రోడ్డెక్కి బీసీలు, పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గడంపై ఆందోళన!





