క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రము జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో గురువారం (ఫిబ్రవరి 19, 2026) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంగా.. హైదరాబాద్ నుండి అనంతపురం వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) సూపర్ లగ్జరీ బస్సు జాతీయ రహదారి 44పై అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
వీరిలో 9 మందికి తీవ్ర గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌ల ద్వారా చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం లేదా మితిమీరిన వేగం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది, పోలీసులు క్రేన్ సహాయంతో బస్సును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. క్షతగాత్రులలో సుబ్బారాయుడు, అరుణ, మోహన్ రెడ్డి వంటి వారిని గుర్తించి వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
