
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ సర్వేయర్లకు కూడా హాజరు తప్పనిసరి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రీ సర్వే, స్వమిత్వ వంటి ఇతర విధుల కోసం గ్రామాలు మరియు మండలాలు మరియు వేరే చోట విధులు నిర్వర్తించే వారికి కూడా హాజరు తప్పనిసరి చేస్తూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి.జయలక్ష్మి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మేరకు వారి హాజరుపై నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వాలని గ్రామ, వార్డు సచివాలయాల విభాగానికి ఆమె లేఖ రాసి పంపారు. ఈ నేపథ్యంలోనే రీ సర్వే విధుల్లో భాగంగా సొంత మండలం లేదా ఇతర మండలాల్లో పనిచేసే వారికి కూడా స్థానిక గ్రామ మరియు వార్డు సచివాలయంలో కచ్చితంగా హాజరు నమోదు చేసుకోవాలని తెలిపారు.
చనిపోయిన కోళ్లను చెరువు కట్టపై పడేసిన దుండగులు..
రీసర్వే పనుల్లో ఉన్నామంటూ, తమకు హాజరు వేయాలని పలువురు సర్వేయర్లు కొంతకాలంగా అధికారులను కోరుతున్నారు. కానీ ఇతర మండలాలకు డిప్యూటీ అయిన వారు రి సర్వే పనులు మానేసి ఇతర కార్యక్రమాలలో బిజీగా ఉండిపోతున్నారన్న ఫిర్యాదులకు ఎక్కువగా వస్తుండడంతో ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో తప్పనిసరిగా హాజరు నమోదు చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.