ఆంధ్ర ప్రదేశ్

ఏపీ ఇంటర్ విద్యార్థులు అలర్ట్… పరీక్షల మార్కులలో మార్పులు?

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్కుల విధానాన్ని మార్చింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్షల్లో మార్కుల విధానంపై విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మొత్తం నాలుగు పేపర్లలో 35% మార్కులు సాధించి.. మిగతా ఒక పేపర్లో కనీసం 30% మార్కులు పొందిన కూడా పాస్ గా ఇస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఈ కొత్త మార్పులు వర్తించవు అని స్పష్టం చేశారు. ఈ కొత్త విధానం తదుపరి విద్య సంవత్సరం నుంచి అమలులోకి రానుంది అని కాబట్టి మొదటి సంవత్సరం చదివే విద్యార్థులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మరోవైపు బయాలజీ, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ విషయాల్లో 85% మార్కులకు మాత్రమే ఎగ్జామ్స్ జరుగుతాయని తెలిపారు. వీటిలో పాస్ అవ్వడానికి ఫస్ట్ ఇయర్లో కనీసం 29 మార్కులు రావాలి, అదే సెకండ్ ఇయర్లో అయితే 30 మార్కులు సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక గణితం సబ్జెక్ట్ మాత్రమే వంద మార్కులకు జరుగుతుంది అని స్పష్టం చేశారు. కాబట్టి ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ వారికి గణితంలో రెండు పేపర్లు ఉండవు. విద్యాశాఖ విడుదల చేసినటువంటి ఈ కొత్త విధానాలను విద్యార్థులు తప్పక తెలుసుకోవాలని సూచించారు.

Read also : కార్తీకమాసం ఎఫెక్ట్.. కిటకిట లాడబోతున్న దేవాలయాలు..!

Read also : నటి రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. త్వరలోనే సన్యాసం అంటా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button