ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల తేదీలు ఖరారు చేశారు ప్రభుత్వం. అయితే మొదటగా మార్చి 15 తారీకు నుండి పరీక్షలు నిర్వహించాలని భావించగా మార్చి 18 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని తాజా షెడ్యూల్ విడుదల చేశారు రాష్ట్ర ప్రభుత్వం. మార్చి 18 నుంచి 30వ తారీకు వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పరీక్ష కేంద్రాల ఎంపిక పైన కూడా జిల్లా విద్యాశాఖ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసినట్లుగా తెలిపారు.
మంచు గొడవలకి కారణం ఇదే అన్న పనిమనిషి!.. చివరికి?
మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, 19న ద్వితీయ భాష, 20 న ఇంగ్లీష్ , 22న గణితం, 23న ఫిజికల్ సైన్స్, 26న బయోలాజికల్ సైన్స్, 27న సామాజిక అధ్యయనాలు, 28న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2, 30న సెకండ్లాం లాంగ్వేజ్ పేపర్ 2 ను నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు వెల్లడించారు. మేరకు పరీక్షల అధికారిక షెడ్యూల్ ను విడుదల చేశారు. కాగా ఇప్పటికే 10వ తరగతి విద్యార్థుల కోసం వందరోజుల కార్యచరణ ప్రణాళిక అమలులోకి వచ్చిన విషయం మనకు తెలిసిందె.
పట్టణాల నుండి గ్రామాలకు పాకిన సైబర్ స్కామ్స్!… జాగ్రత్త?
ఇక సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం విద్యార్థులకు సెలవు దినాలను ప్రకటించింది. ఇందులో భాగంగానే జనవరి 13, 14, 15 తేదీలు సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది. ఇక మిగతా అన్ని రోజులు అదనపు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖను కోరింది. ఇక పదో తరగతి విద్యార్థులకు ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆరు సెషన్లలో తరగతులు నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.