డిసెంబర్ వచ్చినా తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు. వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు., ఉపరితల ద్రోణి ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. ఈక్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు మరో వాయుగుండం ముప్పు పొంచివుంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మరింత బలపడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఈనెల 11వ తేదీ నాటికి శ్రీలంక-తమిళనాడు తీరానికి చేరే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందరి వాతావరణశాఖ తెలిపింది. నిన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు కురిసింది. చలి తీవ్రత కాస్త తగ్గింది. హైదరాబాద్‌లో నిన్నటి నుంచి వాతావరణం మారిపోయింది. మబ్బుపట్టి వానలు కురుస్తోంది. రేపటి వరకూ అంటే డిసెంబర్ వరకూ ఇదే పరిస్థితి వుంటుందని వాతావరణశాఖ తెలిపింది.
తెలంగాణలో ఉదయం పూట దట్టమైన పొగమంచు కురుస్తోంది. రాత్రి పూట చలిగాలులు వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త నెరిగినప్పటికీ చలి తీవ్రత కూడా వుంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఇక ఏపీలో అల్పపీడన ప్రభావం కలిపిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
గత పదిరోజులుగా ఫెంగల్ తుఫానుతో నెల్లూరు, చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు అయ్యింది. ఇప్పుడు తాజాగా మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఫెంగల్ తుఫాన్ కారణంగా ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వరుసగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. తిరుపతి, తిరుమలలోనూ భారీ వర్షాలు కురిసాయి. తిరుమలలో జలాశయాలు అన్నీ నిండు కుండలా మారాయి. ఇప్పుడు మరోసారి అల్పపీడనం ధ్రోణి రానున్న నాలుగు రోజుల్లో కోస్తా జిల్లాలకు భారీ వర్షసూచనతో మరోసారి అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. భారీ నష్టాలతో ఇప్పటికే పంటలకు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లింది.
మరిన్ని వార్తలు చదవండి…
‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’.. ప్రకటించిన కేంద్రం!
ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్.. పుష్ప మెగా ఫైర్
శివరాజ్ కుమార్ కు క్యాన్సర్!…తన ఆస్తి అంత ఏం చేస్తున్నాడో తెలుసా..?
వైరల్ అవుతున్న కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డు..
భూకంపం దెబ్బకి ఊగిపోయిన సమ్మక్క, సారక్క ఆలయం!
కోమటిరెడ్డి ఎఫెక్ట్.. రీజనల్ రింగ్ రోడ్డుకు అటవీ అనుమతులు
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం
బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్
జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్
అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?
కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్
జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు
నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?