
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- గత ఆగస్టు నెల నుంచి ఈరోజుటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం నిన్న తీరం దాటడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయినా కానీ వాతావరణ శాఖ అధికారులు మరొక హెచ్చరికలు జారీ చేశారు. ఈనెల 31వ తేదీన అండమాన్ సమీపంలోని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతున్నట్లుగా ప్రకటించారు. ఇది కాస్త అక్టోబర్ 1 లేదా 2వ తేదీన అనగా పండగ రోజున అల్పపీడనంగా మారే చాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంగా రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ భారీ వర్షాలు దంచి కొట్టడం ఖాయమని తెలిపారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.
Read also : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు?
ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు గాను రాష్ట్రవ్యాప్తంగా చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గ్రామాలు నీటిలో మునిగిపోగా మరికొన్ని లోతట్టు ప్రాంతాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పొలం పనులు ప్రారంభం కాగా… వేసిన నాట్లు వర్షాల కారణంగా దెబ్బతిన్నాయని చాలామంది రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో పండుగ ఉన్న సందర్భంగా వర్షాలు ఎటువంటి అనర్థాలకు దారితీస్తాయో అని ప్రజలు భయంతో ఉంటున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఇరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రజలకు అన్ని విధాలుగా సహాయక చర్యలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రతిపక్ష పార్టీ నాయకులైతే అధికార పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అపాయాలను ముందే గుర్తించాల్సిన అవసరం ఉంది కదా అని… విమర్శిస్తున్నారు.
Read also : ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు