
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాలలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచి కొడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు మరో తుఫాన్ హెచ్చరిక చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి “మొంతు” తుఫాన్ అనే ముప్పు పొంచి ఉందని తాజాగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది కాలంలో ఇదే ఒక బలమైన తుఫాను అని.. ఈనెల 28వ తేదీ అర్ధరాత్రి లేదా 29వ తేదీ తెల్లవారుజామున తీరం దాటే అవకాశాలు ఉన్నాయని… ఈ తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈనెల 26వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరి ముఖ్యంగా ఈనెల 28,29 తేదీలలో తీర ప్రాంత జిల్లాలలోని స్కూలు మరియు కాలేజీలకు సెలవులు ప్రకటించాలని అధికారులు సూచించారు. ఇక ఇవ్వాలా మరియు రేపు రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. కాబట్టి ఈ నెల చివరాఖరిలోపు వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రానికి వర్షపు ముప్పు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికీ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అలాగే వ్యవసాయదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ ఈ తుఫాన్ హెచ్చరికతో ఇంకా ఏమీ నష్టాలు జరుగుతాయో అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also : త్వరలోనే దేశమంతటా మావోయిజం, నక్సలిజం లేకుండా చేస్తాం : ప్రధాని మోదీ
Read also : మునుగోడులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి





