
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఏపీ రాష్ట్రానికి మరో భారీ తుఫాన్ ముప్పు ప్రభావం పొంచి ఉంది . ఇప్పటికే మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల కురవగా వ్యవసాయ పంటలన్నీ కూడా దారుణంగా నాశనం అయిపోయాయి. తాజాగా వాతావరణ శాఖ అధికారులు రాబోయే 48 గంటల్లో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉంది అని చేదువార్తను తెలియజేశారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది అని.. ఈ అల్పపీడనం సోమవారం నాటికి వాయుగుండం గా మారి ఆ తర్వాత 48 గంటల్లోనే తుఫానుగా బలపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో ఈనెల 27, 28, 29 తేదీల వరకు కూడా కోస్తా మరియు రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కచ్చితంగా కురుస్తాయని APSDMA అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు తిరుపతి, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. కాబట్టి ఈ అల్పపీడనం వాయుగుండం గా మారి తుఫానుగా బలపడితే మాత్రం మరోసారి వర్ష బీభత్సం చూడవచ్చు అని… కాబట్టి ఏవైనా అత్యవసర ప్రయాణాలు అలాంటివి ఉంటే ముందుగానే చూసుకోవాలి అని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read also : AI Effect: ‘ఆప్షనల్’గా మారనున్న ఉద్యోగాలు: ఎలన్ మస్క్
Read also : సాగర్ TO శ్రీశైలం.. రేపటి నుంచే ప్రారంభం!





