
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు మరో అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ములక్కా జల సంధి పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్ప పీడనం నేడు వాయుగుండంగా బలపడనుంది అని APSDMA తెలిపింది. ఇది మరో 48 గంటలలో తుఫానుగా మారి భారీ వర్షాలకు సూచికగా మారుతుంది అని ప్రకటించారు. మరోవైపు ఇవ్వాలా నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావం కారణంగా ఈరోజు నుంచి 28వ తేదీ వరకు కూడా దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరోవైపు 29 మరియు 30 తేదీలలో దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇంకోవైపు ఉత్తర కోస్తాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో మొత్తంగా ఈ రోజు నుంచి 5 రోజులు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మొంథా తుఫాన్ కారణంగా రైతులు ఎంతలా తమ వ్యవసాయ పంటలను కోల్పోయారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడిప్పుడే కొన్ని పంటలు చేతికి అందుతున్న సమయంలో మరోసారి ఇలా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నారు.
Read also : ప్రతి NTR అభిమానికి క్షమాపణలు.. అలా అనకుండా ఉండాల్సింది!
Read also : టమాటా రేట్లను చూసి నోరెళ్ళబెడుతున్న సామాన్యులు!





